Tata Sons IPO: టాటా గ్రూప్‌ వివాదం వేళ ఆర్బీఐ ఎంట్రీ.. టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Tata Sons IPO: టాటా గ్రూప్‌ వివాదం వేళ ఆర్బీఐ ఎంట్రీ.. టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక ఆదేశాలు.. ఏం చెప్పిందంటే?

Noel Tata vs N Chandrasekaran : టాటా గ్రూప్‌లో గత కొంత కాలంగా వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఇప్పటికే ఒకవైపు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్, అందులో మెజార్టీ వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నాయకత్వ సంక్షోభం నెలకొంది. ఈ గొడవల మధ్య టాటా సన్స్ లిస్టింగ్ ఇష్యూ ఉంది. టాటా సన్స్‌ను నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేయాలని ఆర్బీఐ ఎప్పటినుంచో చెబుతున్నా దానిని పక్కనబెట్టి అనవసర వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి లిస్టింగ్ విషయమై టాటా సన్స్‌ను హెచ్చరించింది. ఈ మేరకు టాటా సన్స్ సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) లేఖ రాసింది. ఇక్కడ అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ (NBFC- UL) మార్గదర్శకాల్ని కచ్చితంగా పాటించాల్సిందేనని, లిస్టింగ్ కూడా ఇందులోకే వస్తుందని స్పష్టం చేసింది.

images

ఇక్కడ నిబంధనలు, నియంత్రణా మార్గదర్శకాలకు సంబంధించి టాటా సన్స్ అక్టోబర్ 6న ఆర్బీఐని స్పందన కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 16న ఆర్బీఐ నుంచి రెస్పాన్స్ అందుకుంది. NBFC- UL కింద వర్తించే నిబంధనలు, మార్గదర్శకాలు అన్నీ పాటించాలని ఆర్బీఐ సూచించింది. దీని ప్రకారం టాటా సన్స్ కచ్చితంగా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కావాల్సిందేనని తేల్చిచెప్పింది. నవంబర్ 26న టాటా సన్స్ బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో దానికి 10 రోజుల ముందుగా ఆర్బీఐ నుంచి లేఖ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Vedanta Lanjigarh’s Skills Training Centre Secures 93% Job Placement for 21st First Food & Beverage (F&B) Batch in Kalahandi Related Post Vedanta Lanjigarh’s Skills Training Centre Secures 93% Job Placement for 21st First Food & Beverage (F&B) Batch in Kalahandi

వాస్తవానికి టాటా సన్స్ లిస్టింగ్‌కు సంబంధించి ఆర్బీఐ 2022, సెప్టెంబర్ 30న తొలిసారి ఆదేశాలు జారీ చేసింది. అప్పర్ లేయర్ NBFC జాబితాలో చేరిన కారణంగా లిస్టింగ్ కావాలని టాటా సన్స్ సహా మరికొన్ని కంపెనీలను ఆదేశించింది. అప్పుడు సుమారు 16 కంపెనీలను ఆర్బీఐ ఈ జాబితాలో చేర్చగా 14 కంపెనీలు విలీనం లేదా ఐపీఓల ద్వారా మార్కెట్లో లిస్ట్ అవ్వగా, సంఘ్వీ ఫైనాన్స్ పబ్లిక్ ఫండ్స్ తీసుకోకపోవడం వల్ల ఈ జాబితా నుంచి బయటికి వచ్చింది. ఇక ప్రస్తుతానికి టాటా సన్స్ ఒక్కటే మిగిలి ఉంది.

Asuka opens flagship store in Ahmedabad, a new milestone in luxury menswear Related Post Asuka opens flagship store in Ahmedabad, a new milestone in luxury menswear

ఆర్బీఐ ఈ జాబితాలో చేర్చినప్పటి నుంచి మూడేళ్లలోగా ఏ కంపెనీ అయినా లిస్టింగ్ కావాలి. దీనికి గడువు 2025 సెప్టెంబర్ 30 గానే ఉంది. కానీ ఇప్పటికే నాలుగేళ్లు దాటిపోయింది. ఈ క్రమంలోనే లిస్టింగ్ నుంచి తప్పించుకోవడానికి టాటా సన్స్ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. తమ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ లైసెన్స్ కూడా తిరిగిస్తామని దరఖాస్తు చేసుకుంది. దీనిని ఆర్బీఐ తిరస్కరించింది. ఇక్కడ బోర్డు లిస్టింగ్‌కు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తున్నా, టాటా ట్రస్ట్స్ అధినేత నోయల్ టాటా దీనిని వ్యతిరేకిస్తున్నారు. టాటా సన్స్ లిస్టింగ్ అయితే గ్రూప్ వ్యాపార విలువలు దెబ్బతింటాయని, 30-40 వేల మంది వాటాదారులు చేరితే ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. భవిష్యత్తులో లాభాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం రావొచ్చని, సేవా కార్యక్రమాలు పక్కదారి పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మరి ఇప్పుడు టాటా సన్స్ లిస్టింగ్‌కు సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.

మీకు అర్జెంట్‌గా డబ్బులు అవసరమా? ఆర్థిక అవసరాల కోసం లోన్ కోసం చూస్తున్నారా? అయితే రూ. 25 లక్షల వరకు రుణం పొందే అవకాశం. పది నిమిషాల్లోనే మీ ఖాతాలోనే నగదు జమ అవుతుంది. లోన్ పొందేందుకు క్లిక్ చేయండి.

Rachita Jain Crowned Mrs. Femme India 2025 at Mrs. India Inc Season 6 Related Post Rachita Jain Crowned Mrs. Femme India 2025 at Mrs. India Inc Season 6

News Card

Post count

View0
Tags:

About The Author

Administrator Picture

Lorem Ipsum is 2 simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News